ఏసుదాస్‌ పుట్టినరోజున శబరిమలలో ప్రత్యేక పూజలు

Telugu Lo Computer
0


ప్రముఖ గాయకుడు, హరివరాసనం అవార్డు గ్రహీత కె.జె.ఏసుదాస్‌ పుట్టినరోజు సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఉత్తర ఆషాఢం పూజల కోసం శుక్రవారం ఆలయాన్ని తెరిచిన అర్చకులు గణపతి హోమం చేశారు. ఇదే రోజు ఏసుదాస్‌ జన్మదినం కావడంతో ఆయన పేరిట అయ్యప్పస్వామికి నెయ్యాభిషేకం, సహస్రనామార్చన, ఇతర పూజలు చేసినట్లు టీడీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయనకు ప్రసాదాలు పంపించనున్నట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)