మలేషియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న సాత్విక్‌-చిరాగ్ జోడీ

Telugu Lo Computer
0


కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్ లో భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మలేషియా ఓపెన్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న మొదటి భారత జోడిగా చరిత్ర సృష్టించారు. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా జోడి కాంగ్ మిన్ హ్యూక్ - సియో సెయుంగ్ పై 21-18, 22-20 తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ప్రపంచ నం.2 ర్యాంక్‌లో ఉన్న డైనమిక్ ద్వయం 2023 నుండి వారి అసాధారణమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆరు టైటిళ్లను సొంతం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)