ఎర్రసముద్రంలో డెసర్ట్ నైట్‌ పేరుతో గగనతల విన్యాసాలు !

Telugu Lo Computer
0


ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని హౌతీ ఉగ్రవాదులు ఇటీవల దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. నౌకలపై వరుస దాడులు, హైజాక్‌ వంటి ఘటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నడుమ భారత్‌ సహా ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సంయుక్తంగా భారీ వైమానిక విన్యాసాలు చేపట్టాయి. డెసర్ట్ నైట్‌ పేరుతో నిర్వహిస్తున్న గగనతల విన్యాసాల్లో.. మూడు దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్‌లు పాల్గొన్నాయి. భారత వాయుసేనకు చెందిన Su-30 ఎంకేఐ, MiG-29, జాగ్వార్‌ ఫైటర్‌ జెట్లతో పాటు సీ-130-జే రవాణా విమానాలు, గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం కలిగిన విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల వాయుసైన్యం మధ్య సమన్వయం, పరస్పర సహకారం మెరుగుపరచుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారత వాయుసేన వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌, యూఏఈ వైమానిక దళం నుంచి ఎఫ్‌-16 యుద్ధ విమానాలు ఇందులో భాగమయ్యాయి. మరోవైపు, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ రానున్నారు. ఈ పరేడ్‌లో 95 మంది సభ్యుల ఫ్రాన్స్‌ బృందమూ పాల్గొననుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)