యోగిని కలిసిన హనుమాన్ టీమ్ !

Telugu Lo Computer
0


'హనుమాన్' చిత్ర యూనిట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమ య్యారు. హనుమాన్ టీమ్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, యోగిని కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా 'హనుమాన్' టీమ్ ని సీఎం యోగి ప్రశంసించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమంతుని శక్తి ఆధారంగా ఒక రియల్ ఇండియన్ సూపర్ గా చెప్పారు. యోగిని కలిసిన సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.."యోగి జీని కలవడం నిజంగా నాకు గౌరవం మరియు స్ఫూర్తిదాయకమైన క్షణం. 'హనుమాన్' కోసం ఆయన ప్రోత్సాహం ఇస్తామన్నారు. భారతీయ ఇతిహాసాలతో సూపర్ హీరో డైనమిక్స్‌ను విలీనం చేసే సినిమాల కోసం తాను సహకరిస్తానని యోగి చెప్పినట్టు వెల్లడించాడు. ఇక సినిమాల్లో మన సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయన మాతో చర్చించారు. సినిమాల్లో సంప్రదాయం మరియు ఆవిష్కరణల కలయికకు విలువనిచ్చే నాయకుడు రాజకీయాల్లో ఉండటం సంతోషకరమైన విషయం" అని అన్నారు ప్రశాంత్ వర్మ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశం అనంతరం హీరో తేజ సైతం కృతజ్ఞతలు తెలిపారు. "యోగి జీని కలవడం ఒక సంపూర్ణమైన గౌరవం. 'హనుమాన్'లో ప్రధాన పాత్ర పోషించడం ఒక సవాలు లాంటిది" అని తేజ అన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)