ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కేబినెట్ మంత్రి హోదా తో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. 2022 నవంబర్ 10వతేది న తాము చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టానని 13 నెలల 15 రోజులు కాలం అధికారంలో ఉన్నానన్నారు. ఇప్పుడు రాజీనామా లేఖ ఇచ్చానని.. సంక్రాంతి సెలవులు ఉన్నందున తర్వాత వర్కింగ్ డే నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. కొమ్మినేని హఠాత్తుగా రాజీనామా చేయడానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)