రాంగ్‌ రూట్‌లో వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్‌లోని నోయిడాలోఎక్స్‌ప్రెస్‌ వేపై ఒక కారు రాంగ్‌ రూట్‌లో వేగంగా వెళ్లింది. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కెమెరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.శనివారం నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వేగంగా తప్పుడు మార్గంలో ప్రయాణించింది. ఈ నేపథ్యంలో ఎదురుగా వచ్చిన ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఆ బైక్‌ నడుపుతున్న వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ మార్గంలో వెళ్తున్న ఒక కారు డ్యాష్‌ బోర్డ్‌పై ఉన్న కెమెరాలో ఈ ప్రమాదం సంఘటన రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)