ప్రపంచ రికార్డు సాధించిన గాయని సుచేతా సతీష్ !

Telugu Lo Computer
0


దుబాయ్‌లో జరిగిన ఓ సంగీత కచేరిలో కేరళకు చెందిన సుచేతా సతీష్ 140 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. నవంబర్ 24, 2023 న దుబాయ్‌లో 'కాన్సర్ట్ ఫర్ క్లైమేట్' పేరుతో జరిగిన కచేరిలో సుచేత సతీష్ ఈ అరుదైన ఘనత సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన వీడియోలో సుచేతా పాడిన పాటలు వీనుల విందుగా ఉన్నాయి. ఒకే ప్రదర్శనలో అత్యధిక భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించడంతో తన పేరును సుస్థిరం చేసుకున్నారు సుచేత. ఆమె సాధించిన రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. 'దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో ఈ అద్భుతమైన విజయం జరిగింది' అని ఆల్ ఇండియా రేడియో న్యూస్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)