ప్రయాణికుడి మొబైల్‌ చోరీకి దొంగ యత్నం ?

Telugu Lo Computer
0


బీహార్‌లోని భాగల్‌పూర్‌లో స్టేషన్‌ నుంచి రైలు కదిలింది. ఇంతలో రైలులోని ప్రయాణికుడి చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌ లాక్కునేందుకు బయట ఉన్న ఒక దొంగ ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా అతడికి సహకరించారు. ఈ నేపథ్యంలో కదులుతున్న రైలు కిటికీ బయట ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. కాగా, ఆ స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. ఆ వ్యక్తులు దొంగ అనుచరులుగా భావిస్తున్నారు. ఆ స్టేషన్‌లో గతంలో కూడా ఇలాంటి తరహా సంఘటనలు జరిగాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)