భారత్‌ మాకు అత్యంత సన్నిహిత దేశం !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవ్స్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను మాల్దీవ్స్‌ అసోషియేషన్ ఆఫ్‌ టూరిజం ఇండస్ట్రీ ఖండించింది. ఈ మేరకు MATI ఒక ప్రకటన విడుదల చేసింది. మాల్దీవ్స్‌కు అత్యంత సన్నిహిత దేశాల్లో భారత్‌ ఒకటని, భారత్‌తో మాకు మంచి అనుబంధం ఉన్నదని తన ప్రకటనలో పేర్కొన్నది. మేం సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారి ముందుగా స్పందించే దేశం భారతేనని తెలిపింది. కరోనా సమయంలో కూడా భారత్‌, భారతదేశ ప్రజలు చేసిన మేలును మరువలేమంది. మాల్దీవ్స్‌ పర్యాటక రంగం బలోపేతానికి కూడా భారత్‌ సహకారం మరువలేనిదని పేర్కొంది. ఎప్పటిలాగే భారత్‌-మాల్దీవ్స్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. కొందరు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అనుబంధంపై ప్రభావం చూపవని భావిస్తున్నామని అభిప్రాయపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)