థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ సంపద విలువ రూ. 3 లక్షల కోట్లు !

Telugu Lo Computer
0


కింగ్‌ రామాగా పిలిచే థాయిలాండ్‌ రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ సంపద విలువ రూ. 3 లక్షల కోట్లు పైనే. వేల ఎకరాల భూమి, 38 విమానాలు, వందల కార్లు, సుమారు రూ.వంద కోట్ల విలువైన వజ్ర వైడూర్యాలు. ఇలా ఎన్నో రకాల విలువైన వస్తువులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు.  16,210 ఎకరాల భూమి, దేశ వ్యాప్తంగా 40వేల స్థిరాస్తులతో దేశంలో అతిపెద్ద భూస్వామిగా నిలిచారు. వీటిలో ప్రభుత్వ భవనాలు, మాల్స్‌, హోటళ్లు ఉండటం విశేషం. థాయిలాండ్‌లోనే రెండో అతి పెద్ద బ్యాంకు సియామ్‌ కమర్షియల్‌ బ్యాంకులో 23శాతం వాటా ఉంది. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమల్లో ఒకటైన సియామ్‌ సిమెంట్‌ గ్రూప్‌లోనూ 33.3 శాతం ఉంది. రాజకుటుంబానికి బోయింగ్‌, ఎయిర్‌బస్‌ విమానాలు కూడా ఉన్నాయట. 21 హెలికాప్టర్లతో కలిపి వీటి సంఖ్య 38 ఉన్నట్లు సమాచారం. వీటన్నింటి వార్షిక నిర్వహణ ఖర్చే రూ.524 కోట్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యంత విలాసవంతమైన మెర్సిడెస్‌ బెంజ్‌, లిమజీన్‌తో సహా 300 లగ్జరీ కార్లు, బంగారు తాపడంతో కూడిన 52 పడవలూ ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన 545 క్యారెట్‌ 'గోల్డెన్‌ జూబ్లీ డైమండ్‌' కూడా వీరి వద్దే ఉంది. దాని విలువ సుమారు రూ.98కోట్లుగా అంచనా. 1782లో నిర్మించిన రాజభవనమే 23 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉందట. అయితే, రాజు మహా వచిరలాంగ్‌కాన్‌ ఆ చారిత్రక సౌధంలో నివసించడం లేదు. ప్రస్తుతం అందులో ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియాలు ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)