హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం !

Telugu Lo Computer
0

యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది. సుదీర్ఘ విరామం తరువాత అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగడం, అది కూడా మధ్య తూర్పు దేశంపై కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ దేశాలు.. ఈ దాడుల్లో అమెరికా సైన్యానికి తమవంతు సహాయ, సహకారాలను అందించాయి. త్వరలో భారత్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయింది. యెమెన్‌ దేశంలోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను ప్రారంభించినట్లు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తోన్న హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా ఆసియా సహా పలు పాశ్చాత్య దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు యెమెన్‌లోని హౌతి తిరుగుబాటుదారులు. యెమెన్‌కు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రంపై పట్టును సాధించారు. ఈ మార్గంలో తిరుగాడే నౌకలను తమ ఆధీనంలో తెచ్చుకుంటోన్నారు. సిబ్బందిని అపహరిస్తోన్నారు. ఇటీవలే భారత్‌కు చెందిన నౌకను కూడా హౌతీ రెబెల్స్ స్వాధీన పర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులను సైతం వినియోగిస్తోండటం ఆందోళన కలిగించే అంశం. ఎర్ర సముద్రం గుండా రాకపోకలు సాగించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇప్పటివరకు 27 సార్లు దాడులకు పాల్పడ్డారు హౌతి తిరుగుబాటుదారులు. దీనివల్ల 50కి పైగా దేశాలు ప్రభావితం అయ్యాయి. 20కి పైగా దేశాలకు చెందిన సిబ్బంది బందీలుగా పట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)