విజయవాడ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిగా నాని

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కీలక మార్పులు చేస్తున్నది. గెలుపు గుర్రాలకే టికెట్ల ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు విడుతల్లో అభ్యర్థులను మార్చిన వైఎస్సార్‌ సీపీ.. తాజాగా 21 మందితో మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో ఆరుగురు ఎంపీ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గస్థాయిలో నేతలు, కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో సీఎం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాల్సిందేనన్నారు. సిట్టింగ్‌ స్థానాల్లో బలహీనంగా ఉంటే.. నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు అవసరమవుతాయని స్పష్టం చేశారు. ఆయా మార్పులకు మార్పులకు సహకరించాలని సూచించిన జగన్‌ రాబోయే రోజుల్లో గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల బలాబలాలు.. సామాజిక సమీకరణలను లక్ష్యంగా చేసుకొని మూడో జాబితాను రూపొందించినట్లు తెలుస్తున్నది. మూడో జాబితాను గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.  శ్రీకాకుళం (ఎంపీ) : పేరాడ తిలక, విశాఖపట్నం (ఎంపీ) : బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు (ఎంపీ) : కాకుమూరి సునీల్‌ యాదవ్‌, విజయవాడ (ఎంపీ) : కేశినేని నాని, కర్నూలు (ఎంపీ) : గుమ్మునూరి జయరాం, తిరుపతి (ఎంపీ) : కోనేటి ఆదిమూలం

అసెంబ్లీ ఇన్‌చార్జీలుగా  ఇచ్చాపురం : పిరియా విజయ, టెక్కలి : దువ్వాడ శ్రీనివాస్‌, చింతలపూడి (ఎస్సీ) : కంభం విజయరాజు, రాయదుర్గం : మెట్టు గోవిందరెడ్డి, దర్శి చూడేపల్లి : శివప్రసాద్‌రెడ్డి, పూతలపట్టు (ఎస్సీ) : మూతిరేవుల సునీల్‌కుమార్‌, చిత్తూరు : విజయానందరెడ్డి, మదనపల్లె : నిస్సార్‌ అహ్మద్‌, రాజంపేట : ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఆలూరు : బూసినే విరూపాక్షి, కొడుమూరు (ఎస్సీ) : డాక్టర్‌ సతీశ్‌, గూడురు ఎస్సీ (ఎస్సీ) : మేరిగ మురళీ, సత్యవేడు (ఎస్సీ) : మద్దిల గురుమూర్తి, పెనమలూరు : జోగి రమేశ్‌, పెడన : ఉప్పాల రాము. 

Post a Comment

0Comments

Post a Comment (0)