దేశంలో కొత్తగా 609 కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 609 కొత్త కేసులు నమోదు కాగా, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 3368 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సాధారణ కరోనా వైరస్ కేసులతోపాటు కొత్త వేరియంట్ జేఎన్.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై ఇప్పటికే రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్‌పై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది. జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్దగా ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇతర వ్యాధులతో బాధపడుతుండేవారు మాత్రం ఈ వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, జేఎన్.1 వేరియంట్ ను ప్రత్యకమైన 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ  పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ వేరియంట్ అంతగా ప్రమాదకరం కాదని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)