ఆకాశ్‌ న్యూ జెనరేషన్‌ క్షిపణి పరీక్ష విజయవంతం !

Telugu Lo Computer
0


కాశ్‌-ఎన్‌జీ ( న్యూ జెనరేషన్‌) క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు భారత్‌ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) ప్రకటించింది. ఒడిశాలోని చాందిపూర్‌ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్‌)లో శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు తక్కువ ఎత్తులో ఉన్న మానవరహిత వేగవంతమైన లక్ష్యాన్ని చేధించే ఆకాశ్‌-ఎన్‌జీ మిసైల్‌ పరీక్ష విజయవంతం అయిందని పేర్కొంది. ఇకపై ఈ క్షిపణిని భారత సైన్యం, వాయుసేన ఉపయోగించుకోనుందని తెలిపింది. ఆకాశ్‌-ఎన్‌జీ క్షిపణ వ్యవస్థ అత్యాధునిక, హైస్పీడ్‌తో వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షిపణి పరిధి దాదాపు 80 కిలో మీటర్లు. ఆకాశ్‌ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్‌డీఓ 'ఎక్స్‌' (ట్విటర్‌)లో పేర్కొంది. పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థ విజయవంతమైన పనితీరును భారత్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ క్షిపణ దేశియంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్‌, కమాండ్ కంట్రోల్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థతో కూడిన క్షిపణి అని రక్షణ శాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)