2030 నాటికి ఫ్రాన్స్‌లో 30 వేల మంది భారతీయ విద్యార్థులు !

Telugu Lo Computer
0


2030 నాటికల్లా 30 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులను చేర్చుకోవాలని ఫ్రాన్స్ ఆశావహమైన లక్షం పెట్టుకుందని మాక్రాన్ వెల్లడించారు. '2030 నాటికి ఫ్రాన్స్‌లో 30 వేల మంది భారతీయ విద్యార్థులు ఉంటారు. అది ఎంతో ఆశావహమైన లక్షమే. కానీ అది సాకారం అయ్యేలా చూస్తాను' అని మాక్రాన్ 'ఎక్స్'లో వాగ్దానం చేశారు. విద్యార్థులకు ఫ్రాన్స్ ఏవిధంగా సాయం చేస్తుందో మాక్రాన్ విశదీకరిస్తూ, తమ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యయానికి ఫ్రెంచ్ భాష మాట్లాడలేని విద్యార్థులను అనుమతించేందుకు అంతర్జాతీయ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 'అలయన్సెస్ ఫ్రాంయైజెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్రెంచ్ భాష మాట్లాడలేని విద్యార్థులను మా విశ్వవిద్యాలయాల్లో చేరేలా చూసేందుకు అంతర్జాతీయ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం' అని ఆయన తెలియజేశారు. 'కానీ దీనితోనే ముగియలేదు. ఫ్రాన్స్‌లో చదువుకున్న పూర్వపు భారతీయ విద్యార్థులు ఎవరికైనా వీసా ప్రక్రియకు మేము వీలు కల్పిస్తాం' అని మాక్రాన్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)