శబరిమల ప్రసాదం ఒక్కో భక్తుడికి 2 డబ్బాలే !

Telugu Lo Computer
0

ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని శబరిమల అయ్యప్పస్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబరు 26న రెండు కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్టును ఇచ్చారు. అవసరమైన మొత్తంలో ఆ కంపెనీలు డబ్బాలను అందించలేకపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)