డిసెంబరులో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల మంది మృతి

Telugu Lo Computer
0


ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఒక్క డిసెంబరు నెలలోనే కొవిడ్ వల్ల 10 వేలమంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. క్రిస్మస్ సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందింది. కొవిడ్ వైరస్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూనే ఉందని, ఈ వైరస్ వల్ల నవంబరు నెలలో ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరిన వారి శాతం 42 నుంచి 62 శాతానికి పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్ వైరస్ అమెరికా, యూరప్ దేశాల్లో అధికంగా ప్రబలిందని టెడ్రోస్ పేర్కొన్నారు. కొవిడ్ వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఒక్క డిసెంబరు నెలలోనే 10 వేల కొవిడ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)