మణిపూర్‌లో కిడ్నాప్‌కి గురైన నలుగురి హత్య !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు. రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్‌లోని అకాసోయ్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు శీతాకాలంలో కట్టెలు సేకరించడానికి సమీపంలోని అడవికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చంపడానికి ముందు వీరిని మిలిటెంట్లు హింసించినట్లు తెలుస్తోంది. బిష్ణుపూర్‌లోని కుంబిలోని పోలీసులు అడవిలో ప్రయాణించి మృతదేహాలను ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. చురచంద్‌పూర్ జిల్లాలో కుకీల ప్రాబల్యం ఉండగా.. బిష్ణుపూర్ జిల్లా మైయిటీల ఆధిపత్యంలో ఉంది. ఈ రెండు జిల్లాలను విభజించే 'బఫర్ జోన్'లోకి నలుగురు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)