సైనికులు అదుపులో ఉన్న ముగ్గురు మృతి !

Telugu Lo Computer
0


గ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్‌లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆర్మీ ఆదేశించింది. జమ్ముకశ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం జరిగిన ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు బఫ్లియాజ్ ప్రాంతానికి చెందిన సుమారు 15 మందిని ఆర్మీ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పౌరులైన మహ్మద్ సఫీర్, షబీర్ అహ్మద్, షోకత్ హుస్సేన్ ఆర్మీ కస్టడీలో మరణించారు. గాయపడిన సుమారు 12 మంది గ్రామస్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న గ్రామస్తులను సైనికులు కొట్టి చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆర్మీ జవాన్ల టార్చర్‌ వల్ల ముగ్గురు పౌరులు మరణించగా పలువురు గాయపడినట్లు గ్రామస్తులు, రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు పౌరుల మరణంపై సమగ్ర దర్యాప్తునకు ఆర్మీ ఆదేశించింది. అలాగే ఆ వీడియో క్లిప్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఆర్మీ సీనియర్ అధికారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)