అత్తను దారుణంగా కొట్టిన కోడలు !

Telugu Lo Computer
0


కేరళలో వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధురాలు అనే కనికరంగా కూడా లేకుండా ఆమె పట్ల కోడలు కర్కశంగా వ్యవహరించిన ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక వీడియో పోలీసుల కంటపడటంతో సదరు కోడలును అరెస్టు చేసిన సంఘటన కేరళలోని కోల్లామ్ జిల్లాలో జరిగింది. ఈ వైరల్ వీడియోలో ఓ వృద్ధురాలు బయటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్లోని మంచంపై కూర్చుంది. అక్కడే ఉన్న కోడలు ఎందుకో తెలియదు అత్తపై విరుచుకుపడింది. తనని లేచి వెళ్లిపోమ్మంటూ గట్టి అరవడం మొదలు పెట్టింది. కోడలు తీరు చూసి ఆ వృద్ధురాలు బిక్కుబిక్కుమంటూ అక్కడు కూర్చుని ఉండిపోయింది. దీంతో కోపంతో ఊగిపోతున్న కోడలు అత్తను ఒక్కసారిగా మంచం మీద నుంచి ముందుకు తోసింది. దీంతో ఆ వృద్ధురాలు ముందుకు పడిపోయింది. ఇందుకు సంబంధించిన ఘటనను అక్కడే బెడ్‌రూంలో ఉన్న వ్యక్తి ఫోన్‌లో వీడియో తీశాడు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళపై మండిపడుతున్నారు. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఇక ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో కోడలిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)