అయ్యప్ప దర్శన సమయం గంట పెంపు !

Telugu Lo Computer
0


బరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని గంటపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శబరిమల వద్ద రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో దర్శన సమయాలను పొడిగించేందుకు శబరిమల తంత్రి అనుమతి ఇచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులకు 14 గంటల పాటు సమయం పడుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పోలీసులను జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు దాదాపు 14 గంటలకు పైగా క్యూలైన్లలో నిల్చుని భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కాగా క్యూ కాంప్లెక్స్‌లో సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుండడంతో వర్చువల్ క్యూ బుకింగ్‌ను రోజుకు 90 వేల నుంచి 80 వేలకు తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. మంత్రి కె.రాధాకృష్ణన్‌, ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు (టీడీబీ) ప్రెసిడెంట్‌ పిఎస్‌ ప్రశాంత్‌తో శనివారం జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా నిర్దేశించిన ప్రదేశాలలో స్పాట్ బుకింగ్ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. దర్శన సమయాలను రోజూ 17 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీడీబీ పేర్కొంది. ఆలయ సమయాలను పొడిగించడం కష్టమని శబరిమల తంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని బోర్డు శనివారం హైకోర్టుకు నివేదించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)