ఆరు నెలల పసికందుకి కోవిడ్ పాజిటివ్ !

Telugu Lo Computer
0


తెలంగాణలో 15 నెలల చిన్నారికి వైరస్ సోకడం అందరినీ షాక్ కి గురి చేసింది. తాజాగా వెస్ట్ బెంగాల్ లో 6 నెలల పసికందుకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. కోల్ కతా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో పసికందు బాధపడుతోందని డాక్టర్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 6 నెలల చిన్నారి కూడా ఉంది. పసికందు తల్లిదండ్రులు బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ కు వచ్చారు. కరోనా బారిన పడ్డ ముగ్గురూ.. తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయగా.. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా, ఇవాళ దేశంలో 640 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 997కి చేరింది. కాగా, కరోనా కొత్త వేరియంట్ JN.1 ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయి. అయితే, కోవిడ్ కొత్త వేరియంట్ JN1 పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీనికి వేగంగా విస్తరించే లక్షణం ఉన్నప్పటికీ.. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు కొత్త వేరియంట్ త్వరగా సోకే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో 15 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నీలోఫర్ డాక్టర్లు తెలిపారు. నాంపల్లికి చెందిన చిన్నారి జ్వరం, న్యుమోనియాతో బాధపడుతోంది. కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)