అవిసె గింజల లడ్డూ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


విసె గింజల లడ్డూని చలి కాలంలో తినడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ ని పెంచి, సీజనల్ వ్యాధులు దరి చేరకుండా చూస్తుంది.  అవిసె గింజలు, బాదం పప్పు, జీడి పప్పు, ఎండు ద్రాక్షను ఒక కడాయిలో తీసుకుని వేయించి పక్కకు పెట్టు కోవాలి. ఇవి చల్లారాక వీటిని మిక్సీలో కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం తురము, యాలకుల పొడి, నెయ్యి వేసి లడ్డూల్లా చుట్టు కోవాలి. వీటిని చిన్న పిల్లల నుంచి వృద్ధులు కూడా తినవచ్చు. ఈ లడ్డూ రోజుకు ఒకటి తింటే సరి పోతుంది. ఈ లడ్డూ తినడం వలన ఎముకలు బలంగా, దృఢంగా తయారవుతాయి. రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అదే విధంగా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. అదే విధంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వలన మల బద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలు పోతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా చలి కాలంలో తింటే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)