ఇరాక్​ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా దాడి !

Telugu Lo Computer
0


త్తర ఇరాక్​లోని అమెరికా ఆర్మీ స్థావరాలపై మిలిటెంట్లు డ్రోన్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ మిలిటెంట్ల స్థావరాలపై దాడులకు ఆదేశించారు. ఈ క్రమంలో అమెరికా దళాలు ఇరాక్​లోని కతైబ్ హెజ్బొల్లా ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేశాయని ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. ఇరాన్ సపోర్ట్ ఉన్న హెజ్బొల్లా గ్రూప్ మిలిటెంట్లకు చెందిన 3 స్థావరాలపై ఇరాక్​లోని తమ బలగాలు దాడులు చేశామన్నారు. ఇరాక్, సిరియాల్లో ఉన్న తమ ఆర్మీ క్యాంపులపై మిలిటెంట్లు తరుచూ దాడులకు దిగుతున్నారని చెప్పారు. అందుకే కచ్చితమైన టార్గెట్​లను ఎంచుకుని ఎదురుదాడికి దిగినట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)