దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి !

Telugu Lo Computer
0


కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చే వంద రోజుల పాటు పార్టీ కోసం పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వంద రోజులు పార్టీకి, దేశానికి ఎంతో కీలకమని అన్నారు. 2024 ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ సన్నద్ధం అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రతి మందులకూ గడువు తేదీ ఉంటుంది. అలాగే నరేంద్రమోడీ మందు దేశంలో ఇక పని చేయదని సెటైర్స్ పేల్చారు. బీజేపీ తమది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని పిలుస్తున్నదని, వాస్తవానికి డబుల్ ఇంజిన్ అంటే అదానీ-ప్రదానీ అని విమర్శించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)