యూరప్‌ లో ఇస్లాంకు చోటు ఉండబోదు !

Telugu Lo Computer
0


స్లాం సంస్కృతి, యూరోపిన్‌ నాగరికతలోని విలువలు, హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అన్నారు. అందుకే యూరప్‌ లో ఇస్లాంకు చోటు ఉండబోదు అంటూ చెప్పుకొచ్చారు. సౌదీ అరేబియాలోని షరియా చట్టాల గురించి పరోక్షంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని విమర్శలు గుప్పించారు. సౌదీ అరేబియా, ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్‌ సెంటర్లకు నిధులు అందిస్తుందని ఆమె ఆరోపించారు. అది తప్పు, ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను మెలోనీ తప్పుపట్టింది. ఆ దేశ షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం లాంటి విధానాలు తీవ్రమైన నేరాలని జార్జియా మెలోనీ తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని జార్జియా మెలోనీ చెప్పారు. ఈ విధానాలను ఎక్కడైనా అమలు చేయాలన్నారు. యూరప్‌లోని తమ నాగరికత విలువలకు, ఇస్లాం విధానాల మధ్య చాలా తేడాలు ఉన్నాయి.. అలా రెండు దేశాల మధ్య సారూప్యత సమస్య తలెత్తుతోందని ఆమె పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియ మెలోనీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మ్కాస్‌లు కూడా పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)