తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానం !

Telugu Lo Computer
0


తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఫలితాల తరహాలోనే లోక్ సభ స్థానాలను అత్యధిక సంఖ్యలో గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీ కీలక నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని తెలంగాణలో పోటీ చేయాలని తీర్మానించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫెర్స్ కమిటీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ తీర్మానం చేశారు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసినట్లుగా, ఇప్పుడు సోనియాగాంధీ కూడా తెలంగాణలోని ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని హస్తం పెద్దలు తీర్మానించారు. అయితే పార్టీ నేతల నిర్ణయంపై మేడమ్ సోనియాగాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి. కర్నాటక తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ ను కొనసాగిస్తోంది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ జాతీయ నాయకురాలు సోనిగాంధీ పోటీ చేయాలని తీర్మానించారు. సోమవారం కాంగ్రెస్‌ పొలిటికల్ అఫెర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. అందులోనే పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డితో పాట క్యాబినెట్ మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు సోనియాగాంధీ తెలంగాణ లోక్ సభ బరిలో దిగాలని తీర్మానించారు. అయితే గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. ఆ లెగసీని కొనసాగించి..కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికే ఈసారి సోనియాగాంధీ పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)