ప్రేమ జంట ఆత్మహత్య !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో తమ కుటుంబాలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధానగర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల రాఖీ చౌహాన్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన 24 ఏళ్ల మనీష్ చౌహాన్ ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమను ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో ఇంటి నుంచి వెళ్లిపోయి ఆదివారం రాత్రి రాఖీ, మనీష్ పెండ్లి చేసుకున్నారు. అనంతరం ఒకే తాడుతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాఖీ, మనేష్‌ మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత ప్రేమ జంట మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)