ఎన్ కౌంటర్లో కానిస్టేబుల్ మృతి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని లక్నోలో మరో నెలలో పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువ కానిస్టేబుల్ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి చేసుకోవాల్సిన తమ కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. డిసెంబర్ 25న ఓ క్రిమినల్ ను పట్టుకునేందుకు కన్నౌజ్ లోని అతడిని ఇంటికి వెళ్లారు నలుగురు పోలీసుల బృందం. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై నిందితుడు అశోక్ యాదవ్, అతని కుమారుడు అభయ్ పోలీసులు పై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యంగ్ కానిస్టేబుల్ సచిన్ రాఠీ తొడకు బుల్లెట్ తగిలింది. పోలీసులకు, గ్యాంగ్ కు మధ్య దాదాపు గంట సేపు జరిగిన ఈ ఎన్ కౌంటర్ తర్వాత తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలైన అతడిని వెంటనే కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాఠి తీవ్రంగా రక్తం కోల్పోవడంతతో డిసెంబర్ 25న కానిస్టేబుల్ అర్థరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన రాఠి 2019లో పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరారు. ఫిబ్రవరి 5న మహిళా కానిస్టేబుల్‌తో వివాహం జరగాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)