నిందితులకు ఏడు రోజులు కస్టడీ !

Telugu Lo Computer
0


పార్లమెంట్ ఘటనలో నలుగురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు కస్టడీ విధించింది. ఢిల్లీ హైకోర్టు నలుగురు నిందితులకు ఏడు రోజులపాటు కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు మనోరంజన్, సాగర్, అమోల్, నీలంలను పోలీసులు గురువారం ఢిల్లీ హైకోర్టులో హాజరుపరిచారు. నిందితులపై ఇప్పటికే ఉగ్రవాద నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఢిల్లీ హైకోర్టును కోరారు. అయితే కోర్టు నలుగురు నిందితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కు ఏడు రోజులపాటు కస్టడీకి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది అతుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము 15 రోజుల పాటు పోలీసు కస్టడీ కోరామని, కానీ కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసిందని తెలిపారు. పార్లమెంట్ లో బుధవారం భారీ భద్రతా ఉల్లంఘన జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి అక్రమంగా తరలించిన డబ్బాల నుంచి దట్టమైన పసుపు పొగను వదిలారు. దీంతో ఒక్కసారిగా సభలో అలజడి రేగింది. ఇద్దరు వ్యక్తులను ఎంపీలు, భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరిని లక్నోకు చెందిన డి మనోరంజన్ లుగా గుర్తించారు. అయితే మరో ఇద్దరు పార్లమెంట్ బయట అలజడి సృష్టించారు. విజిటర్స్ పాస్ పొందలేని హర్యానాలోని హిసార్ కు చెందిన నీల దేవి, మహారాష్ట్రలోని లాథూర్ కు చెందిన అమోల్ షిండేలు స్మోక్ బాంబులు పట్టుకుని పార్లమెంట్ బయట నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నట్లుగా గుర్తించారు. పార్లమెంట్ లోపల, బయట అలజడి సృష్టంచిన సాగర్ శర్మ, మనోరంజన్, నీల దేవి, అమోల్ షిండేలను అక్కడే అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు లలిత్, విక్రమ్ ల పాత్ర బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో విగ్రమ్ ను గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకోగా, లలిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)