ఎంపీల సస్పెన్షన్​ అత్యంత దారుణం

Telugu Lo Computer
0


పార్లమెంట్‌లో జరిగిన దాడిని ప్రస్తావించినందుకు, పూర్వాపరాల ఆరాకు యత్నించినందుకు ఎంపీలపై సస్పెన్షన్ల వేటు వేస్తారా? అని కాంగ్రెస్ ఎంపి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఎంపిల సమావేశ స్థలి పార్లమెంట్‌లో అత్యంత ప్రమాదకర రీతిలో పరిణామాలు జరిగాయి. వీటిపై సర్కారు నుంచి సమాధానాలు రాబట్టుకోవల్సి ఉంటుంది. దీనికి యత్నించగా, బదులుగా ఎంపిలపై చర్యకు దిగుతారా? నిజానికి విజిటర్స్ పాస్ ఇచ్చిన బిజెపి ఎంపిపై చర్య తీసుకోవల్సి ఉంది. ఆయన నుంచి తగు వివరణను లోక్‌సభలో చెప్పించాల్సి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా నిలదీసినందుకు ఎంపీలపై సామూహక వేటుకు దిగడం అన్యాయం, అక్రమం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన కెసి తెలిపారు. బిజెపి ఎంపి నిర్లక్షం, బాధ్యతారాహిత్యం వల్లనే దుండగులు సభలోకి ప్రవేశించారు. మరి ఘటనకు మూలమైన వ్యక్తిని వదిలి ఇతరులపై చర్యకు దిగుతారా? అని విపక్ష నేతలు ప్రశ్నించారు. జరిగిన పరిణామాలు అన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా భావించాల్సి వస్తోంది. ఇది ప్రజాస్వామ్య హత్యనే. బిజెపి ప్రభుత్వం చివరికి పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంప్ చేసి పారేసింది. అధికార పక్షం ఏం చెప్పితే అది సభాధ్యక్ష స్థానాలలోని వారు చేసేస్తున్నారు. ఈ విధంగా ప్రతివ్యవస్థకు ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోందని, ఇదేం పద్థతి అని సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు ఆ తరువాత తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతోన్న తంతుతో ఇక ప్రజాస్వామిక ప్రక్రియ జాడలేకుండా పోయిందని వేణుగోపాల్ విమర్శించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)