తగ్గనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు ?

Telugu Lo Computer
0


త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపట్టింది. దేశవ్యాప్తంగా రేట్లను తగ్గించాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిజినెస్ టుడే టీవీ అధికార వర్గాలను ఉటంకిస్తూ లీటరుకు నాలుగునుంచి ఆరు రూపాయలకు తగ్గే అవకాశం ఉందని, పది రూపాయల మేరకు తగ్గించినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపింది. ఈ మేరకు చమురు కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. గత మూడు నెలలుగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 70 నుంచి 80 అమెరికా డాలర్లుగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర 109.66 రూపాయలుగాను. డీజెల్ ధర 97.82 రూపాయలుగాను ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)