వంతెన కింద ఇరుక్కున్న విమానం !

Telugu Lo Computer
0


విమానం బాడీని ముంబై నుంచి అస్సాంకు ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్నారు. అయితే బీహార్‌లోని మోతీహారీలో పిప్రకోఠి వంతెన కింద అది ఇరుక్కుపోయింది. దీంతో లారీ డ్రైవర్లు స్థానికుల సహాయంతో దానిని బయటకు తీశారు. ఈ సందర్భంగా క్రాస్‌ రోడ్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కాగా, గతంలో కూడా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఒక సంఘటన జరిగింది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమాన భాగాన్ని ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తుండగా అండర్‌పాస్‌ వద్ద ఇరుక్కుపోయింది. అలాగే కోల్‌కతాలోపాటు పలు ప్రాంతాల్లో కూడా వంతెన కింద విమాన భాగాలు ఇరుక్కున్న సంఘటనలు జరిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)