ఒక్కడు చేసిన దానికి తెలుగు ఇండస్ట్రీని తిట్టొద్దు !

Telugu Lo Computer
0


ర్నలిస్ట్, సంతోషం పత్రికా అధినేత 'సురేష్ కొండేటి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్, పీఆర్వో కంటే సినిమా ప్రమోషన్స్‌లో సెలెబ్రిటీలను అడిగే ప్రశ్నలతో ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆయన అడిగే ప్రశ్నలకు హీరో, హీరోయిన్స్‌ చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట హల్ చల్ చేశాయి. ఈ మధ్య కలర్ స్వాతిని విడాకుల గురించి అడిగి  విమర్శల పాలయ్యారు. తాజాగా సురేష్ కొండేటి మరోసారి వార్తల్లో నిలిచారు.సురేష్ కొండేటి ప్రతి ఏటా 'సంతోషం' అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది గోవాలో సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుక కోసం దక్షిణాది నుంచి పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులను గోవాకు తీసుకెళ్లారు. ఈ ఈవెంట్ కోసం వచ్చిన కన్నడ నటులకు చేదు అనుభవం ఎదురైందట!. కొందరు నటీమణుల రూం బిల్లులు కూడా చెల్లించలేదట!. ఈ విషయంపై సంతోషం అవార్డు వేడుకల మీద కన్నడ ప్రతినిధులు విమర్శలు చేస్తూ  టాలీవుడ్‌ను తప్పు పట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఇలానే ఉంటది అంటూ విమర్శలు చేశారు. టాలీవుడ్ మీద చేస్తున్న విమర్శల మీద అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు. ఓ వ్యక్తి చేసిన దానికి తెలుగు ఇండస్ట్రీని తిట్టొద్దన్నారు. సోమవారం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ 'ఓ జర్నలిస్ట్ చాలా సంవత్సరాలుగా ఓ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్నాడు. ఈసారి గోవాలో ప్లాన్ చేశాడు. ఏదో కొన్ని కారణాల వల్ల అతడు ఫెయిల్ అయ్యాడు. అక్కడికి వెళ్లిన వారు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై కొన్ని పేపర్లు ఆయన పీఆర్వో అంటూ మా కుటుంబానికి సంబందించిన వ్యక్తి గురించి రాశాయి. అవి చూసి చాలా బాధపడ్డా. ఆయన పీఆర్వో అని పత్రికలు రాయడం కరెక్ట్ కాదు. కొన్ని ఇతర బాషల వారికి ఇబ్బందులు జరిగాయి. వారు తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు. ఓ వ్యక్తి చేసిన దానికి టాలీవుడ్‌కు ఆపాదించడం కరెక్ట్ కాదు. అతను ఎవరికీ పీఆర్వో కాదు. మాకు, మా కుటుంబానికి పీఆర్వో కాదు' అని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)