రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Telugu Lo Computer
0


ఢిల్లీలో రేపు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన డిమాండ్‌పై ప్రతిపక్షాలు, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే.. మొత్తం 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేశారు. ఈ ఎంపీలు మొత్తం శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. ఈ క్రమంలో.. ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్, శశి థరూర్‌లతో సహా 49 మంది ప్రతిపక్ష ఎంపీలను మంగళవారం లోక్‌సభ నుండి సస్పెండ్ చేశారు. సోమవారం 33 మంది ఎంపీలు దుష్ప్రవర్తన కారణంగా సభ నుండి సస్పెండ్ అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)