గుజరాతీయులతో నేను చక్కగా కలిసిపోతా !

Telugu Lo Computer
0


దుబాయ్‌లో శనివారం భారతీయ విద్యార్థులు నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో  కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానం ఇచ్చారు. గుజరాతీయుల మధ్య మీరు ఉండటం ఎలా అనిస్తోంది? అని ఓ విద్యార్థి అడగ్గ 'గుజరాతీయుల మధ్యలో ఉండటం చాలా అసక్తికరంగా ఉంటుంది. ఇండియాలో అన్ని ప్రాంతాల నుంచి నాకు స్నేహితులు ఉన్నారు. గుజరాత్‌లోని పలు చోట్ల మా బంధువులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నేను అక్కడికి వెళ్లినప్పటి నుంచి దేశంలో మరే రాష్ట్రానికి వెళ్లనన్నిసార్లు గురురాత్‌కు వెళ్లా. గుజరాతీయులతో నేను చక్కగా కలిసిపోతా' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)