'ఆయుష్మాన్‌ భారత్‌' హెల్త్ సెంటర్ల పేరు మార్పు !

Telugu Lo Computer
0


'ఆయుష్మాన్‌ భారత్‌' హెల్త్ సెంటర్ల పేరును 'ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌'గా మార్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై సమాచారం ఇచ్చేందుకు ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పేరును మార్చిన తర్వాత ఆ ఫొటోలను ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్‌నెస్‌ సెంటర్స్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని నిర్దేశించింది. 2018 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి కుటుంబానికి రూ.5లక్షల వరకు వైద్యం అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా దేశంలోని కోట్లాది మంది 1393 రకాల వ్యాధులకు చికిత్స పొందేందుకు అవకాశం కలిగింది. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన ఆసుపత్రులు.. ఈ స్కీమ్ మార్గనిర్దేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. పథకం కింద పేర్కొన్న వైద్య సేవలను తప్పనిసరిగా అందించాలి. ఏ కారణం చేతనైనా వైద్యం నిరాకరిస్తే కార్డు హోల్డర్ సంబంధిత హాస్పిటల్‌పై ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ ఆయుష్మాన్ భారత్ లిస్టులో ఉన్న ఏదైనా ఆస్పత్రి వైద్యం చేయడానికి నిరాకరిస్తే.. అందుకు గల ప్రధాన కారణమేంటో అడిగి తెలుసుకోవాలి. సదరు ఆసుపత్రిలో సంబంధిత చికిత్సకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉండి కూడా నిరాకరిస్తే ఫిర్యాదు చేయొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)