వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ సెమీస్ లో భారత్ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 2 November 2023

వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ సెమీస్ లో భారత్


సీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ 302 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. 358 పరుగుల లక్ష్య చేధనలో శ్రీలంక కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత పేసర్లు షమీ, సిరాజ్ ధాటికి తట్టుకోలేక శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతికే శ్రీలంక బ్యాటర్ నిశాంక అవుట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా నిశాంక మైదానం నుంచి వెనుతిరిగాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ కూడా తన తొలి బంతికే కరుణరత్నెను ఔట్ చేశాడు. కరుణరత్నె కూడా ఎల్బీగానే అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో ఐదో బాల్‌లో సదిరా సమరవిక్రమను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో సిరాజ్ బౌల్‌కు కెప్టెన్ కుశాల్ మెండిస్ కూడా వెనుతిరగాల్సి వచ్చింది. ఇలా శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. నలుగురు బ్యాట్స్‌మెన్ అవుట్ అయినప్పుడు శ్రీలంక స్కోరు కేవలం మూడు పరుగులు మాత్రమే. ఈ మ్యాచ్ పదో ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ బాధ్యతలను మహమ్మద్ షమీకి అప్పజెప్పాడు.

No comments:

Post a Comment