పెళ్లికొడుకు మెడలో కరెన్సీ నోట్ల దండ ?

Telugu Lo Computer
0


పెళ్లి కొడుకు కరెన్సీ నోట్ల దండతో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లతో ఈ దండను తయారు చేసారట. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పెళ్లికొడుకు కరెన్సీ నోట్ల దండను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. dilshadkhan_kureshipur అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లలో కొందరు అతని సంపదను చూసి ఔరా అని ముగ్ధులైతే మరికొందరు ఇంత విపరీతమైన ప్రదర్శన అవసరమా? అని కూడా తిట్టుకున్నారు. ఇంకా కొందరైతే ఆ నోట్లు నిజమైనవి కాకపోవచ్చు కూడా అని అనుమానం వ్యక్తం చేసారు. వీడియోలో ఇంటి పై గోడ మీద నిలబడ్డ వరుడి మెడలో వేసిన కరెన్సీ నోట్ల దండ కిందవరకూ వేలాడుతూ కనిపించింది. వివాహ వేడుకల్లో ఇలా ఇప్పటివరకు ఎవరూ ఆకట్టుకుని ఉండకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీడియో ప్రకారం హర్యానాలోని ఖురేషిపూర్ గ్రామానికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనేది నిర్ధారణ కాలేదు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివాహ వేడుకల్లో కరెన్సీ నోట్ల దండను వేయడం కొందరి ఆచారం. అయితే కొందరు మాత్రం ఇలా ధరించడాన్ని సంపదను అగౌరపరచడంగా భావిస్తారు. మొత్తానికి లక్షల రూపాయలు కరెన్సీ నోట్ల దండ వేసుకున్న వరుడి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)