ఢిల్లీలో స్వల్పంగా మెరుగుపడిన గాలి నాణ్యత !

Telugu Lo Computer
0


దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల గాలి నాణ్యత సూచీ మెరుగుపడింది. దీంతో బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్‌ కార్లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో సహాయపడటానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద మూడో దశ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా కార్ల వాహనదారులు ఆంక్షలు సడళించడంతో ఢిల్లీ, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, నోయిడా, ఘజియాబాద్‌తో సహా జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతి ఉండనున్నది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌ కార్యచరణను నిర్ణయించేందుకు ఢిల్లీ సర్కారు సమావేశమై చర్చించింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తప్పనిసరిగా ఆంక్షలను అమలు చేయాలని ఆదేశించింది. వాహనాలకు సంబంధించి పీఎస్‌యూ సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని పోలీసులకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులకు రూ.20వేల వరకు జరిమానా విధించారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఎన్‌సీఆర్‌ పరిధిలో 36శాతం వాహనాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు, వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆంక్షలుపై పలు నిర్ణయాలు తీసుకున్నది. స్వల్పంగా గాలి నాణ్యత మెరుగుపడడంతో పలు ఆంక్షలు సడలించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)