హైదరాబాద్ లో లగ్జరీ ఇండ్లపై మోజు !

Telugu Lo Computer
0

రోనా మహమ్మారి తర్వాత అది మరింత పెరిగింది. ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన లగ్జరీ ఇండ్ల ధరలు రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ. 97 శాతం ఇండ్ల విక్రయాలు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ నగరాల్లోనే జరిగాయి. విశాలమైన, వసతులతో కూడిన ఇండ్లకు ప్రాధాన్యం ఎక్కువైంది. అలాగే లగ్జరీ ఇండ్లపైనా భారతీయులు మోజు పెంచేసుకుంటున్నారని రియాల్టీ సంస్థ సీబీఆర్ఈ పేర్కొంది. ఈ ఏడాది జనవరి -సెప్టెంబర్ మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన లగ్జరీ ఇండ్ల ధరలు రూ.4 కోట్లు, అంతకంటే ఎక్కువ. గతేడాదితో పోలిస్తే ఇండ్ల విక్రయాలు 97 శాతం పెరిగాయి. ఆ జాబితాలో ఢిల్లీ- ఎన్సీఆర్ ( దేశ రాజధాని ప్రాంతం), ముంబై, హైదరాబాద్ ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోనే 90 శాతం లగ్జరీ ఇండ్లు అమ్ముడయ్యాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 37 శాతం, ముంబైలో 35, హైదరాబాద్‌లో, పుణెలో నాలుగు శాతం సేల్స్ నమోదయ్యాయి. ఎకానమీ పుంజుకోవడంతోపాటు ఖర్చు చేసే ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలు పెంచుకోవాలన్న ఆకాంక్షలు ఎక్కువ కావడంతోపాటు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల పరిధిలో లగ్జరీ ఇండ్లకు కొరత ఏర్పడటం కూడా వీటి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో అక్టోబర్-డిసెంబర్ మధ్య లగ్జరీ ఇండ్ల విక్రయాలు మరింత పెరుగుతాయని సీబీఆర్ఈ అంచనా వేస్తున్నది. ప్రత్యేకించి ఫస్ట్ టైం లగ్జరీ ఇండ్ల కొనుగోలు దారులు పెరుగుతారని భావిస్తున్నట్లు తెలిపింది. లగ్జరీ ఇండ్ల కొనుగోలు దారుల్లో సంపన్నులు, ఎన్నారైలు ఉన్నారు. లగ్జరీ ఇండ్ల కొనుగోలుతో సంపన్నులు, ఎన్నారైలు పెట్టుబడులను విస్తరిస్తున్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మున్ముందు లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లు పెరిగే ధోరణులు కనిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)