తగ్గిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


విజయదశమి తరువాత భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు కూడా 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 440 వరకు తగ్గింది. విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5570, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6076గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 55700, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 60760గా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5615 (22 క్యారెట్స్), రూ. 6125 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 56150, రూ. 61250గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 450 (22 క్యారెట్స్), రూ. 550 (24 క్యారెట్స్) తగ్గింది. ఢిల్లీలో ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5585, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6091గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400 (22 క్యారెట్స్), రూ. 440 (24 క్యారెట్స్) తగ్గి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55850, రూ. 60910కి చేరింది. వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో కేజీ మీద ఏకంగా రూ. 300 తగ్గింది.

Post a Comment

0Comments

Post a Comment (0)