పిల్లల్ని కిడ్నాప్ చేశాడని కన్నతండ్రిపై కేసు పెట్టలేం !

Telugu Lo Computer
0


ల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వెళ్లడంపై బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. చట్టపరమైన నిషేధం లేనప్పుడు తన బిడ్డను కిడ్నాప్ చేశాడని బయోలాజికల్ తండ్రి (కన్నతండ్రి)పై కేసు నమోదు చేయలేదని తీర్పు చెప్పింది. 35 ఏళ్ల వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్ఏ మెనెజెస్‌లతో కూడిన డివిజన్ బెంజ్ అక్టోబర్ 6 నాటి తన ఉత్తర్వుల్లో, ఏ కోర్టు ఆదేశం ద్వారా ఎలాంటి చట్టబద్ధమైన నిషేధం లేప్పుడు, తండ్రితో పాటు తల్లి కూడా చట్టబద్ధమైన సంరక్షకులని, అందువల్ల పిల్లాడిని తల్లి వద్ద నుంచి తీసుకెళ్లినందుకు కేసు నమోదు చేయరాదని పేర్కొంది. గార్డియన్ అనే వ్యక్తీకరణ మైనర్‌ని చూసుకునే ఏ వ్యక్తికైనా వర్తిస్తుంది, కాబట్టి మా దృష్టిలో చట్టపరమైన నిషేధం లేనప్పుడు, తన సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే నేరానికి తండ్రిపై కేసు నమోదు చేయబడదరిన కోర్టు పేర్కొంది. కన్నతండ్రి బిడ్డను తల్లి కస్టడీ నుంచి తీసుకెళ్లడం వల్ల బిడ్డను ఒక సహజ సంరక్షకుడి కస్టడీ నుంచి మరొకరు తీసుకెళ్లడం మాత్రమే అవుతుందని చెప్పింది. 2023 మార్చి 29న తన మూడేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై అమరావతి పోలీసులు తల్లి ఫిర్యాదు మేరకు తండ్రిపై కేసు నమోదు చేశారు. వీరిద్దరు అప్పటికే విడిపోయారు. అయితే ఈ కేసులో సదరు వ్యక్తి తాను బిడ్డకు తండ్రినని, సహజ సంరక్షుడినని, తనపై కిడ్నాప్ కేసు నమోదు చేయలేమని చెప్పారు. హిందూ మైనారిటీ, గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం మైనర్ పిల్లాడి సహజ సంరక్షుడి నిర్వచనాన్ని కోర్టు ప్రస్తావించింది. హిందూ మైనర్‌కి తండ్రి సహజసంరక్షకుడని, అతని తర్వాత తల్లి అని పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)