సుప్రీంకోర్టు ప్రాంగణంలో 'మిట్టీ కేఫ్' !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో 'మిట్టీ కేఫ్' శుక్రవారం ప్రారంభమైంది. దీన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ కేఫ్ ప్రత్యేకత ఏమిటంటే దీన్ని కేవలం దివ్యాంగులే నిర్వహిస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ మిట్టీ కేఫ్‌ను నిర్వహించనుంది. లాభాపేక్ష లేకుండా ఆ కేఫ్ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఈ స్వచ్ఛంద సంస్థ బెంగళూరు విమానాశ్రయం, వివిధ బహుళ జాతి కంపెనీల (ఎంఎన్సీ) ఆఫీసులతో సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల 35 కేఫ్‌లను నిర్వహిస్తోంది. 2017 నుంచి వాటిని ఆ సంస్థ నిర్వహిస్తోంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంలో భాగంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో మిట్టీ కేఫ్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. కేఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ ''ప్రత్యేకంగా దివ్యాంగులతో నడిచే మిట్టీ కేఫ్‌ను సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉంది. దీనికి బార్ సభ్యులందరూ మద్దతు ఇవ్వాలి'' అని  కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)