సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 70 లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి !

Telugu Lo Computer
0


బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి  . చంద్రా లేఔట్ లో ఫేజ్ 1లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఆన్ లైన్ లో ఓ మహిళ అక్టోబర్ 1న పరిచయమైంది. తనను మరియా లియోనాస్ మిక్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంది. ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. దీంతో బాధితుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ మహిళ తన స్కెచ్ స్టార్ట్ చేసింది. ఆయనతో చాటింగ్ చేయడం ప్రారంభించింది. అక్టోబర్ 8న ఆయనకు ఒక మేసేజ్ పంపింది. ఖరీదైన గిఫ్ట్ లు పంపిస్తానని చెప్పింది. ఆ తర్వాతి రోజు కానుకలు పంపాను అని ఆయనతో చెప్పింది. అక్టోబర్ 11న ఓ వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు. తాను కస్టమ్స్ అధికారిని అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత నుంచి పెద్దాయనకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఓ వ్యక్తి ఫోన్ చేసి మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు. ఇలా కస్టమ్స్ డ్యూటీ, కరెన్సీ కన్వర్షన్ చార్జీలు, ట్యాక్స్ పేరుతో డబ్బు గుంజాడు. ఇదంతా నిజమే అని నమ్మిన బాధితుడు వారు అడిగినంత డబ్బు ఇచ్చుకుంటూ వెళ్లాడు. ఇలా 25 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.70 లక్షలు చెల్లించాడు. అయితే, కానుకలు మాత్రం అందలేదు. దీంతో తాను మోసపోయానని వృద్ధుడు గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన డబ్బు తనకు తిరిగి వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. ఉద్యోగం చేసే సమయంలో బాధితుడు కొంత డబ్బు దాచుకున్నాడు. ఇక, రిటైర్ మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. అలా 70 లక్షలు జమ కాగా ఇప్పుడా డబ్బు మొత్తం పోయి రోడ్డున పడ్డాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)