ది లేడీ కిల్లర్ సినిమా తొలి రోజు కలెక్షన్ రూ .36 వేలు !

Telugu Lo Computer
0


ది లేడీ కిల్లర్ సినిమా కి వచ్చిన వసూళ్లు మొత్తం బాలీవుడ్ పరువు తీసే విధంగా ఉన్నాయి. శుక్రవారం విడుదల అయిన ది లేడీ కిల్లర్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్ నటించాడు. ఆయనకు జోడీగా భూమి పెడ్నేకర్ నటించింది. అజయ్ బహ్ల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు  ది లేడీ కిల్లర్ సినిమా మొదటి రోజు కేవలం రూ.38 వేల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. దేశం మొత్తం కూడా ఈ సినిమాకి గాను మొదటి రోజు 300 లోపు టికెట్లు తెగినట్లు సమాచారం. కపూర్‌ ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాకు ఇంత దారుణమైన నెంబర్స్ నమోదు అవ్వడం విచిత్రం. కపూర్‌ ఫ్యామిలీ పరువు తీశారు అంటూ ది లేడీ కిల్లర్ టీం మెంబర్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలిరోజు తర్వాత ఈ మూవీని థియేటర్స్ ను తీసేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)