ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 2.24 కోట్ల విలువైన బంగారు కడ్డీల స్వాధీనం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయుడి నుంచి రూ. 2.24 కోట్ల విలువైన 4,204 గ్రాముల బంగారపు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. పాల ప్యాకెట్లలో బంగారం బిస్కెట్లు దాచిన ఆ ప్రయాణికుడు అధికారులకు దొరికిపోయాడు. పాక్స్ కస్టమ్స్ చట్టం 1962 క్రింద అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న అసద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కనిపెట్టలేని విధంగా ట్రాలీ వీల్స్ లో దాచిన 32500 సౌదీ రియాల్ మరియు 150 UAE దిర్హామ్ లు కలిపి సుమారు రూ.7,24,800 విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చండీగఢ్‌లో కూడా భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. బంగారం బిస్కెట్ తో పాటు క్రెడిట్ కార్డులలో 520 గ్రాముల బంగారపు షీట్లను అమర్చి తీసుకువెళ్తున్న ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రికవరీ చేసిన మొత్తం బంగారం విలువ సుమారు రూ.67.71 లక్షలుగా తెలుస్తోంది. తెలివిగా ప్లాన్ చేసి అధికారుల కన్నుగప్పి బంగారం తరలిద్దామనుకుని పాపం ఆ ప్రయాణికులు ఇలా దొరికిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)