2100 నాటికి ప్రపంచ జనాభా తగ్గుదల ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 9 November 2023

2100 నాటికి ప్రపంచ జనాభా తగ్గుదల ?


ప్రపంచంలో పెరుగుతున్న జనాభాపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుందని వాపోతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి అందించిన 'రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022' డేటాలోని వివరాలు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్‌లో ప్రపంచ జనాభాలో తగ్గుదల కనిపించనున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి వెనుకనున్న కారణాలేమిటో కూడా తెలియజేసింది. ప్రపంచంలో 2100 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంటుందనే దానిపై ఈ నివేదికలో అంచనా అందించారు. దీనిలో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, అమెరికా, యూరోపియన్ దేశాల జనాభాకు సంబంధించి అంచనాలున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2021లో భారతదేశ జనాభా 153 కోట్లు. ప్రస్తుత జనాభా దాదాపు 140 కోట్లు. దీని ‍ప్రకారం చూస్తే వచ్చే 77 ఏళ్లలో అంటే 2100 నాటికి భారతదేశ జనాభా 13 కోట్ల మేరకు మాత్రమే పెరగనుంది. 2100వ సంవత్సరంలో ప్రపంచ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చంటూ ఈ అంచనాలలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చైనాతో ముడిపడివుంది. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. యూఎన్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్‌ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100 నాటి జనాభా అంచనాలను రూపొందించారు. ప్రపంచ జనాభా 2086 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేట్లు 2050కి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని ఈ అంచనాలలో వెల్లడయ్యింది. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం, గర్భనిరోధకాల లభ్యత, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం, అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. 

No comments:

Post a Comment