ఆకట్టుకున్న హనుమాన్‌ డ్రోన్‌ !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా వేడుకల్లో హనుమాన్ డ్రోన్‌ ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్‌ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నెల 24న దసరా సందర్భంగా ఆ ప్రాంతంలోని కళాకేంద్ర మైదానం వద్దకు భారీ సంఖ్యలో యువకులు చేరుకున్నారు. సమీపంలోని మహామాయ ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్‌ ఆకారంలో ఉన్న డ్రోన్‌ ఎగురవేశారు. జై హనుమాన్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా, హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్‌ను పలువురు వీడియో రికార్డ్‌ చేశారు. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే హనుమంతుడిని పోలిన్‌ డ్రోన్‌ ఎగురవేయడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోతోపాటు గతంలో పంజాబ్‌లోని లుధియానాలో కూడా హనుమాన్‌ డ్రోన్లను ఎగురవేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నాడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)