కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు !

Telugu Lo Computer
0


తుకమ్మ, దసరా సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు కిక్కిరిపోయాయి. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే రైళ్లు, బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. సొంత వాహనాలపైనా నగరవాసులు పెద్ద సంఖ్యలో పల్లెలకు పయనమయ్యారు. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా కావడంతో జనం భారీగా ఊళ్లకు వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. జేబీఎస్ లో కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ వెళ్లే బస్సులు నిండిపోయాయి. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోయాయి. బతుకమ్మ, దసరా సెలవుల దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపుతోంది. రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రయాణికుల రద్దీ మరో మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. రైల్వే శాఖ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి వరకు సుమారు 600 సర్వీసులను అదనంగా నడిపేందుకు సిద్ధమైంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి, కర్నూలు, విశాఖ, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అయితే ఇదే సమయమని ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)